Thursday 5 December 2019

శ్రీ రామకృష్ణుల ప్రత్యక్ష శిష్యులైన స్వామి అభేధానంద గారి ప్రసంగం

శ్రీ రామకృష్ణుల ప్రత్యక్ష శిష్యులైన స్వామి అభేధానంద గారి ప్రసంగం. మనకు లభిస్తున్న ఏకైక ప్రత్యక్ష శిష్యుల స్వరం వీరి(స్వామి అభేధానంద గారిది) మాత్రమే. ఇంటర్నెట్ లో స్వామి వివేకానందుల వాయిస్ అని సర్క్యులేట్ అవుతున్నది ఫేక్. శ్రీ రామకృష్ణ మఠం వారి నిర్ధారణ ప్రకారం అభేధానందుల స్వరం ఒక్కటే ఈనాడు లభిస్తున్న స్వరం.  ఈ ప్రసంగం శ్రీ రామకృష్ణుల శతజయంతి ఉత్సవాల సందర్బంగా (1936) కలకత్తా రేడియో వారు ప్రసారం చేసినది. స్వామి అభేధానందుల వారి స్వరం విని ఆనందించండి.

తీవ్రసాధన

Tuesday 26 November 2019

శ్రీ రామకృష్ణ పరమహంస వైభవం బ్లాగుకు స్వాగతం

ఓం స్థాపకాయచ ధర్మస్య సర్వ ధర్మ స్వరూపిణే
అవతార వరిష్టాయ రామకృష్ణాయతే నమః

క్షీణించిన ధర్మమును ఉద్దరించిన వాడు, సర్వ మత, ధర్మ స్వరూపుడు, భగవత్ అవతారములలో వరిష్టుడు అయిన శ్రీ రామకృష్ణునికి ప్రణామము


శ్లో|| సర్వ ధర్మ స్థాపకత్వం సర్వ ధర్మ స్వరూపకః
ఆచార్యాణాం మహాచార్యో రామకృష్ణాయతే నమః ||

తా || సర్వ ధర్మములను ఉద్దరించినవాడు, సర్వ ధర్మముల స్వరూపమైనవాడు, ఆచార్యులలో మహాచార్యుడు అయిన రామకృష్ణునికి ప్రణామము.

శ్లో || ఓంకార వేద్యా పురుష పురాణో

బుద్దేశ్చ సాక్షీ నిఖిలశ్చ జంతో
యో వేత్తి సర్వం నచ యస్య వేత్తా

పరాత్మ రూపో భువి రామకృష్ణ ||

తా || ఓంకార జపముచేత తెలియబడు వాడు, పురాణ పురుషుడు, సర్వ ప్రాణుల బుద్ధికి లోపల సాక్షిగా ఉన్నవాడు, సర్వం తెలిసినవాడు, ఎవరిచేతా తెలియబడని వాడు, పరమాత్మ రూపుడు అయిన రామకృష్ణునకు ప్రణామము